కాళ్ల పగుళ్లు పోవాలంటే

చిట్కా వైద్యం

leg cracks
leg cracks

కాళ్ల పగుళ్లు ఎక్కువా పొడి చర్మం వల్ల వస్తాయి. ఇవి రావడానికి కాలంతో సంబంధం లేదు. ఎసిలో పనిచేసినా, మట్టిలో నడిచినా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కాలి పగుళ్లకు అనేక కారణాలు.

ఎక్కువ సేపు నిలబడేవాళ్లల్లో మడమలపై ఒత్తిడి పడి ఫుట్‌ ప్యాడ్‌ విస్తరించడం వల్ల పగుళ్లు వస్తాయి. చర్మంలో తేమ తగ్గినప్పుడు సాగే గుణం కోల్పోతుంది.

దాంతో పాదాల చర్మం బిగుతుగా మారి పగుళ్లు కనిపిస్తాయి.

ఎక్కువ సేపు నిలబడినప్పుడు, అధిక బరువు, ఎగ్జిమా, హైపోథైరాయిడిజం, మధుమేహం వంటి సమస్యలు ఉన్నా.. వెనుకభాగం తెరిచి ఉంటే బూట్లు, ఎత్తు చెప్పులు వాడే వారిలోనూ ఈ సమస్య రావచ్చు.

వాతావరణంలో తేమ తగ్గినా పాదాలు పగులుతాయి. కొందరు వేడి నీళ్లతో స్నానం చేయడం, కాళ్లను తడపడం చేస్తుంటారు. అందుకే గోరువచ్చని నీళ్లను వాడటమే మంచిది.

అలాగే కాళ్లను అయిదు నిమిషాల కంటే ఎక్కువ సేపు నాననివ్వకూడదు.

లేదంటే సహజంగా చర్మంపై ఉండే నూనెల్ని కోల్పోవలసి వస్తుంది. స్నానం చేసిన వెంటనే పొడి వస్త్రంతో కాళ్లను తుడవాలి. మాయిశ్చరైజర్‌ రాసి సాక్స్‌ వేసుకుంటే చర్మానికి రక్షణ.

పగుళ్లురాకుండా మినరల్‌ ఆయిల్‌, లాక్టిక్‌ యాసిడ్‌, యూరియా, గ్లిజరిన్‌, పెట్రోలియం జెల్లీ వంటివి ఉన్న క్రీములు వాడితే మంచిది.

కఠిన రసాయనాలు, సువాసనలు ఉన్న సబ్బులు, క్రీములు వంటివాటికి దూరంగా ఉండాలి. ఇవి చర్మాన్ని పొడిబారుస్తాయి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/