ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం

ప్ర‌మాణ స్వీకారం చేయించిన పోచారం

హైదరాబాద్: తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిపై బీజేపీ అభ్య‌ర్థి ఈటల రాజేందర్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈట‌ల రాజేంద‌ర్ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈట‌ల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

తెలంగాణ నేత‌లు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురి నుంచి 103కి పెరుగుతార‌ని కొన్ని రోజులుగా ఆ పార్టీ ధీమా వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/