ఆర్ఆర్ఆర్ నుండి అదిరిపోయే చరణ్- ఎన్టీఆర్ ల పిక్ వచ్చింది

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొన్నటి వరకు సైలెంట్ గా ఉంది. సినిమా తాలూకా ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా అభిమానులను నిరాశ పరుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమా ఫై అంచనాలు పెంచడమే కాదు మెగా , నందమూరి అభిమానుల్లో ఉత్సహం నింపుతున్నారు. తాజాగా సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చి ఆకట్టుకోగా..బుధువారం ఎన్టీఆర్ – చరణ్ ల పిక్ రిలీజ్ చేసి జోష్ పెంచారు. షూటింగ్ గ్యాప్ లో ఇద్దరు స్టైలిష్ గా కూర్చుని ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తమ హీరోలు ఇలా స్టైలిష్ గా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈరోజు సాయంత్రం నాల్గు గంటలకు చిత్రంలోని ‘నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు నాటు నాటు నాటు నాటు.. వీర నాటు.. ఊర నాటు’ అంటూ సాగే ఊర మాస్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ పవర్ ఫుల్ స్టెప్పులతో దుమ్ములేపినట్లు అర్థం అవుతోంది. ఎంఎం కీరవాణి ఈ పాటకు మాస్ ట్యూన్ సమకూర్చగా.. రాహుల్ సిప్లింగంజ్ – కాల భైరవ హుషారెత్తించేలా ఆలపించారు. ఈ గీతానికి గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు.

ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక మిగతా కీలక పాత్రల్లో ఆలియా భట్ – శ్రియ – సముద్రఖని- ఒలీవియా మోరీస్ నటించారు.సంక్రాంతి కానుకగా జనవరి 07 న ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.