రైతు కూలీలతో కలిసి వరి నాటు వేసిన రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర ను సక్సెస్ లు పూర్తి చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…గత కొద్దీ రోజులుగా సామాన్య ప్రజలను నేరుగా కలుస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వస్తున్నారు. శనివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరిన రాహుల్ .. హర్యానాలోని సోనిపట్ లోని ఓ పొలం వద్ద ఆగారు. కారు ఆపి పొలంలో నాట్లు వేస్తున్న రైతులతో ముచ్చటించారు. ఆలా వారితో కలిసి కాసేపు నాటు వేశారు. ట్రాక్టర్ ఎక్కి కాసేపు పొలం దున్నారు. రాహుల్ ఇలా కలిసి వారితో పనిచేయడం , ముచ్చటించడం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇటీవల బైక్ మెకానిక్ గా కరోల్ బాగ్ ఏరియాలోని ఓ మెకానిక్ షాపులో స్క్రూడైవర్, పానా చేతబట్టిన రాహుల్ గాంధీ.. అంతకుముందు లారీ డ్రైవర్లతో కలిసి రాత్రంతా ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. అలాగే వారం క్రితం రాహుల్ ఖమ్మం లో ఏర్పాటు చేసిన జనగర్జన సభ కు హాజరై , ఎన్నికల మేనిపెస్టో ను రిలీజ్ చేసారు. రాహుల్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది.