వెంకటేష్ ‘దృశ్యం 2’ ట్రైలర్

నవంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా స్ట్రీమింగ్

YouTube video

‘విక్టరీ’ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ”దృశ్యం 2”. ఇది మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. సూపర్ హిట్ ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్. మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాతృక బాటలో థియేట్రికల్ స్కిప్ చేసి ఓటీటీలో విడుదల అవుతోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. టీజర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘దృశ్యం 2’ చిత్రంలో వెంకటేష్ గడ్డం పెంచుకొని మొదటి భాగం కంటే డిఫరెంట్ గా కనిపించారు. వెంకీ భార్యగా సీనియర్ హీరోయిన్ మీనా.. కుమార్తెలుగా ఎస్తర్ అనీల్ – కృతికా నటించారు. సంపత్ నంది – తనికెళ్ళ భరణి – జయకుమార్ – సత్యం రాజేష్ – తాగుబోతు రమేష్ – చలాకీ చంటి – ముక్కు అవినాష్ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ ట్రైలర్ పై అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఉత్కంఠకు గురి చేస్తోంది.

సురేష్ ప్రొడక్షన్స్ – మాక్స్ మూవీస్ – రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. డి.సురేష్ బాబు – ఆంటోనీ పెరుంబవూర్ – రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

తెలంగాణ వార్తలకు: https://www.vaartha.com/telangana/