ఏపిలో నేటి నుండి పెన్షన్ రూ.3 వేలు పెంపు

దశల వారీగా పెన్షన్ పెంచుతూ వచ్చిన సీఎం జగన్

3 thousand increase in pension from today in AP

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం దశల వారీగా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పెన్షన్ ను రూ.3 వేలకు పెంచారు. పెంచిన పెన్షన్ నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా, ఈ నెల నుంచి కొత్తగా 1,17,161 మందికి పెన్షన్ అందించనున్నారు.

2019లో పెన్షన్ రూ.2,250 కాగా… 2022 నాటికి అది 2,500 అయింది. 2023లో రూ.2,750 అందించారు. ఇప్పుడు మరో రూ.250 పెంచి రూ.3 వేలు చేశారు. పెంచిన పెన్షన్ ను మండలాలవారీగా ఈ నెల 8 వరకు అందించనున్నారు. ఈ జనవరిలో మొత్తం 66.34 లక్షల మందికి రూ.1,968 కోట్లు పంపిణీ చేయనున్నారు. కాగా, పెన్షన్ భారం ఏడాదికి రూ.23,556 కోట్లు అని తెలుస్తోంది. కాగా, రూ.3 వేల పెన్షన్ అందిస్తామని గత ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సిపి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.