గెలిస్తే చరిత్రలో ఉంటావ్: ‘గని’ టీజర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్

YouTube video

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ”గని” అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు వెంకటేష్ – సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – ఫస్ట్ సింగిల్ తో పాటు ప్రధాన పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.  ‘గని’ టీజర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించారు. ‘ప్రతి ఒక్కరి కథలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి.. కోరికలు ఉంటాయి కోపాలు ఉంటాయి.. కలబడితే కొడవలు ఉంటాయి.. అలానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఛాంపియన్ అవ్వాలనే ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. వై యూ?’ అని చరణ్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొత్తాన్ని చూపించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాని రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్నాయి. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ‘ఫైట్ విత్ ప్యాషన్.. విన్ విత్ ఎమోషన్స్’ అనే క్యాప్షన్ తో వచ్చిన ”గని” టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/