ప్రశాంత్ కిషోర్ ఫై మండిపడుతున్న వైసీపీ నేతలు

ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాదించబోతుందని పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన కామెంట్స్ ఫై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ… ‘ప్రశాంత్ కిశోర్ ఓ మాయల ఫకీర్. బిహార్లో చెల్లని రూపాయి ప్రశాంత్ అని ఎద్దేవ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో చెల్లని రూపాయి చంద్రబాబు అని ,వీరిద్దరూ కలిసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు అని విమర్శించారు. బాబు స్క్రిప్ట్ పీకే చదువుతున్నారు’ అని మండిపడ్డారు.

ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు… ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ సిద్ధంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గతంలో సొంతంగా సర్వేలు చేయించి, ఎన్నికల ఫలితాలపై ముందే అంచనాలు వెలువరించేవారు. ఐప్యాక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసి, ఆ పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన వ్యూహకర్తగా సేవలు అందించడం మానేసి రాజకీయాలపై దృష్టి సారించారని అంబటి పేర్కొన్నారు.