భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ‘ఎఫ్ 3’

మే27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌ విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న   ఎంటర్టైనర్ `ఎఫ్‌3` ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందించనుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాస్త ఆల‌స్యంగా మే27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా  ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు పాట విడుద‌లై విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ క‌థ డబ్బు చుట్టూ తిరుగుతుంది. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు  ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/

Read more

గెలిస్తే చరిత్రలో ఉంటావ్: ‘గని’ టీజర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ”గని” అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కిరణ్

Read more

వెంకటేష్ ‘దృశ్యం 2’ ట్రైలర్

నవంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా స్ట్రీమింగ్ ‘విక్టరీ’ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ”దృశ్యం 2”. ఇది మలయాళంలో మోహన్ లాల్

Read more

‘ఎఫ్ 2’ చిత్రానికి జాతీయ అవార్డు

ఇండియన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ నుంచి ఎంపిక కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ 2019కి గానూ వివిధ భాషలకు చెందిన పలు సినిమాలకు

Read more