అన్నంతో దోసె…

రుచి : వెరైటీ వంటకాలు

Dosa recipe wiht White Rice
Dosa recipe wiht White Rice

కావాల్సిన పదార్ధాలు:

అన్నం -2 కప్పులు, పుల్లని పెరుగు, రవ్వ ,గోధుమ పిండి- 1 కప్పు చొప్పున, ఉప్పు -రుచికి సరిపడా, వంట సోడా-1 టీ స్పూన్, నీళ్లు – తగినన్ని.

తయారు చేసే విధానం :

ముందుగా మిక్సీలో అన్నం , పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతం అందులో రవ్వ, గోధుమ పిండి, వంట సోడా.. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని.. ఒక బౌల్ లోకి తీసుకోవాలి.. తర్వాత ,తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని దోసెల్లా వేసుకోవాలి. అభిరుచిని బట్టి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వంటివి వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు.