చర్మ సంరక్షణకు బొగ్గు పొడి..

అందమే ఆనందం.

Charcoal powder for skin care
Charcoal powder for skin care

కాలమేదైనా… చాల మందిని జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి వారు యాక్టివేటెడ్ చార్ కోల్ తో తయారు చేసిన మాస్క్ క్లెన్సర్ ని వాడితే అతిగా విడుదల అయ్యే నూనెలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.. అలాగే, ఈ మాస్క్ క్లెన్సర్ చర్మం సహజ నూనెలను కోల్పోకుండా చేస్తుంది..

వాతావరణంలో ఉండే దుమ్ము, ధూళీ చర్మంపై చేరటం వలన స్వేద రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది . ఈ క్రమంలో కొద్దిగా బొగ్గు పొడి కలిపిన పేస్ మాస్క్ ఉపయోగిస్తే , అది మృతకణాలను తొలగిస్తుంది.. మురికి బయటకు వచ్చేలా చేస్తుంది. అయితే ఈ మాస్కులు వాడే విషయంలో వ్యక్తిగత సౌందర్య నిపుణుల సలహా మేరకు చర్మ తత్వాన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది.