హంటా ఫీవర్-వ్యాప్తి : లక్షణాలు

ఆరోగ్య భాగ్యం

Hunta Fever-Spread- Symptoms
Hunta Fever-Spread- Symptoms

హంటా వైరస్ .. ఇది హంటా నిరిడి కుటుంబానికి చెందిన రున్యా వైరస్ . ఇది ఆర్ యన్ ఏ వైరస్ .. ఇవి చుంచు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధి. హంటా వైరస్ లో అనేక రకాలున్నాయి. 1913లో రష్యా లోని తూర్పు సైబీరియా లో మొదట గుర్తుమ్చారు. 1950లో ఉత్తర కొరియా లోని హంటన్ సమీపంలో అమెరికా కొరియా సైనికులకు 3 ఏళ్ళ పాటు జరిగిన కొరియా యుద్ధం లో 300 మంది కిడ్నీ ఫెయిల్యూర్ , షాక్, రక్త స్రావాలతో బాధ పడటంతో హంటా వైరస్ గురించి ప్రపంచానికి తెలిసింది. 1976లో చైనా డాక్టర్ హువాంగ్ లీ దీనికి హాన్ టా ఫీవర్ గా గుర్తించారు.
వ్యాప్తి: ఎలుకల బొరియలు , నివాస స్థలాలను శుభ్రం చేసేటపుడు దుమ్ము, ధూళి వాళ్ళ, వాటి మల మూత్రాల వలన , వ్యాధి గ్రస్తమైన ఎలుకలు చనిపోవటం వలన , గాలి ద్వారా, ముక్కు ద్వారా పీల్చటం వలన ఇన్ఫెక్షన్ ఒకరి నుండి మరొకరికి వస్తుంది.

రకాలు:

హంటా వైరస్ ల తరగతిని బట్టి, ప్రపంచంలో అవి వ్యాపించే స్థలాన్ని, పరిస్థితులను బట్టి వ్యాధి లక్షణాలు కూడా మారుతుంటాయి.

  1. హంటా వైరస్ హేమరేజిక్ ఫీవర్ మరియు రెనాల్ సిండ్రోమ్ దీన్నే హెచ్ ఎఫ్ ఆర్ ఎస్ , యూరోపియన్ డీసీజ్ అంటారు. ఇది దొబ్రావా హంటా వైరస్ వాళ్ళ వస్తుందని ఓల్డ్ వరల్డ్ ( యూరప్ , ఆసియా ) గుర్తించారు. దీన్నే కొరియన్ హేమరేజిక్ ఫీవర్ అని అంటారు. నార్వే లో దీన్ని మైస్ ప్లేగు అని, స్వీడన్ లో ఒలే ఫీవర్ అని అంటారు.
  2. ఇన్ఫెక్షన్ సోకిన 1-2 వారాలు లేదా కొన్ని సార్లు 8 వారాల దాకా వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇవి ఫ్లూ జ్వరం లక్షణాలను కల్గి ఉంటాయి. 5 దశల్లో వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/