టీడీపీ లో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్

మరో మూడు వారాల్లో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏపీలో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు వైసీపీ పార్టీ కి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసి..చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. గతంలో టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్.. గత ఎన్నికల తర్వాత అనూహ్యంగా ఆ పార్టీని వీడి ఎమ్మెల్సీ పదవికీ గుడ్ బై చెప్పి వైసీపీ లో చేరారు.

వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. అయితే వైసీపీలో ఈసారి టికెట్ ఆశించినా దక్కకపోవడం, పార్టీలో ప్రాధాన్యం కూడా తగ్గడంతో చేసేది లేక ఎన్నికల వేళ పార్టీకి గుడ్ బై చెప్పి..ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటె కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు ..టీడీపీ కి రాజీనామా చేసాడు..రేపు వైసీపీ లో చేరబోతున్నాడు.