హైదరాబాద్ శివారులోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

సమ్మర్ వచ్చిందంటే చాలు పలు కారణాలతో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని కెమికల్ కంపెనీ లలో ఎక్కువగా జరిగి..భారీ ఆస్థి , ప్రాణ నష్టం వాటిల్లుతుంటాయి. తాజాగా ఈరోజు శుక్రవారం కూడా అలాంటి ఘటనే జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని అలెన్ హోమియో అండ్ హెర్బల్ ప్రొడక్ట్ కంపెనీలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటులు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 300 మంది కార్మికులు ఉండగా.. ప్రాణ భయంలో చాలా మంది బయటకు పరుగులు తీశారు.

అయితే.. దట్టమైన పొగ అలుముకోవటంతో.. ఎటువెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయారు. ఈ తరుణంలో ఓ యువకుడు తాడు సాయంతో వారందర్ని కిందకు దించాడు. లేదంటే వారంతా మంటల్లో చిక్కుకపోయేవారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్థి నష్టం వాటిల్లింది.