కరోనా ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

YouTube video
Cabinet briefing by Union Ministers Prakash Javadekar, Ravi Shankar Prasad and R. K. Singh

న్యూఢిల్లీ: నేడు ప్రధాన మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ‍్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 1.22 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి బీమా పరిధిని కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. అలాగే 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ-ఆధారిత, ఫలిత-అనుసంధాన పవర్ డిస్కం పథకానికి కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు. అలాగే దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయిందని తెలిపారు. 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు భరత్‌నెట్ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) మోడ్ కింద రూ .19,041 కోట్లతో సాధ్యమయ్యే గ్యాప్ నిధులతో కేబినెట్ ఆమోదించినట్లు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..

•పవర్ డిస్కంల సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థిక సహాయం
•డిస్కంల సామర్థ్యాన్ని పనితీరును మెరుగు పరచుకునేందుకు షరతులతో కూడిన ఆర్థిక సహాయం
•కొత్త పథకం కోసం 3,03,758 కోట్ల రూపాయల అంచనా వ్యయం
•97,631 కోట్లు రూపాయలు కేటాయింపు
•ప్రభుత్వం కేంద్రం విధించిన షరతులకు అంగీకరిస్తే పెద్దఎత్తున డిస్కంలకు ఆర్థిక సహాయం
•భారత్ నెట్ ద్వారా 16 రాష్ట్రాల్లో ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు
•భారత్ నెట్‌కు రూ.19,041 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం
•పవర్‌ డిస్కమ్‌ సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థిక సహాయం
•డిస్కమ్‌ల సామర్థ్యం పెంపునకు షరతులతో కూడిన ఆర్థిక సాయం
•షరతులకు అంగీకరిస్తే డిస్కమ్‌లకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయం

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/