పవన్ నామినేషన్ కు ఆమోద ముద్ర

Pawan Kalyan nomination as Pithapuram MLA candidate

ఏపీలో నిన్నటితో నామినేషన్ల పర్వం పూర్తి కావడం తో..ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన దరఖాస్తుల పరిశీలన మొదలైంది. ఈ క్రమంలో పలువురి నామినేషన్లకు ఆమోదముద్ర పడగా..మరికొంతమంది నామినేషన్ల ను తిరస్కరించారు. ఆమోద ముద్ర పొందిన వారిలో అసెంబ్లీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లలో వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగా గీత, గంటా శ్రీనివాస్, యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీ, నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీదిరి అప్పలరాజు, గౌతు శిరీష, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,దస్తగిరి, బీటెక్ రవి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మార్గాని భరత్, ఆదిరెడ్డి వాసు, ధర్మాన ప్రసాద్, నాదెండ్ల మనోహర్, వెల్లంపల్లి శ్రీనివాస్, బోండా ఉమ, సుజనా చౌదరి, ఎంవీవీ సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్, రఘురామకృష్ణంరాజు, తమన్నా సింహాద్రి వంటి వారు ఉన్నారు.

లోక్ సభ నామినేషన్ల విషయానికి వస్తే.. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, బూడి ముత్యాలనాయుడు, వైఎస్ అవినాష్ రెడ్డి, వల్లభనేని బాలశౌరి, పెమ్మసాని చంద్రశేఖర్, దగ్గుమళ్ల ప్రసాదరావు, గంటి హరీష్ చంద్ర మాథుర్, రాపాక వరప్రసాద్, బైరెడ్డి శబరి, శంకర్ నారాయణ, కేశినేని చిన్ని, కిలారి రోశయ్య, అంబికా లక్షీనారాయణ, పోచ బ్రహ్మానందరెడ్డి, వైఎస్ షర్మిల నామినేష్లలు ఉన్నాయి. పలువురి నామినేషన్ లలో తప్పులు ఉండడం తో వాటిని తిరస్కరించారు.