జేమ్స్ బాండ్ సినిమా పై కరోనా ప్రభావం!

సినిమా విడుదలకు ఏడు నెలలు వాయిదా

James Bond film
James Bond film

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమా జేమ్స్‌బాండ్ అయితే కరోనా ప్రభావం కారణంగా జేమ్స్ బాండ్  ‘నో టైమ్‌ టూ డై’  సినిమా వాయిదా పడింది. కరోనా వైరస్‌ వల్ల ప్రస్తుతం ప్రజలు థియేటర్స్‌కు రావాలంటనే బయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల చేస్తే వచ్చే కలెక్షన్లు రావు. అందుకే కరోనా వైరస్ ప్రభావం తగ్గాకా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. అందుకోసం ఏకంగా ఈ సినిమా విడుదలను ఏడు నెలలు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 12 యూకేలో, నవంబర్ 25 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఈ సినిమా సందడి చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/