మహిళల టీ20: ఆడకుండానే ఫైనల్‌కు భారత్‌

India women's national cricket team
India women’s national cricket team

సిడ్నీ: ఆడకుండానే మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. నేడు సిడ్నీలో ఇంగ్లండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ని భారత్ ఆడాల్సివుండగా, వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కాగా, గ్రూప్ దశలో మెరుగైన పాయింట్లు కలిగివున్న కారణంగా ఇండియా ఫైనల్స్ కు క్వాలిఫై అయిందని మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. కాగా మరో సెమీఫైనల్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుతో భారత జట్టు ఫైనల్ ఆడనుంది. ఇంగ్లండ్ తో మ్యాచ్ రద్దయినట్టు ప్రకటించిన తరువాత భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందిస్తూ, దురదృష్టవశాత్తూ మ్యాచ్ రద్దయిందని, అయితే క్రికెట్ నిబంధనలను ఏ జట్టు అయినా పాటించాల్సిందేనని వ్యాఖ్యానించింది. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ హెథర్ నైట్ మాట్లాడుతూ, ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని వ్యాఖ్యానించింది. రిజర్వ్ డే లేకపోవడం తమ జట్టు అవకాశాలను దెబ్బతీసిందని వాపోయిన ఆమె, ఇకనైనా నిబంధనలను మార్చాలని సూచించింది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/