దేశంలో శాంతి స్థాపన కోసం ఏం చేయడానికైనా సిద్ధం

ఈశాన్య ఢిల్లీ ఘటనలపై ఆగ్రహం

Rajinikanth
Rajinikanth

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈశాన్య ఢిల్లీలో గతవారం జరిగిన హింసాత్మక ఘటనలను ఖండించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లను అదుపు చేయలేకపోయిన వారు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో శాంతి స్థాపన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నిన్న పలువురు ముస్లిం మతపెద్దలు రజనీతో భేటీ అయ్యారు. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సూపర్ స్టార్.. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతి, సామరస్య స్థాపనకు తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్టు రజనీ చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/