‘కొవిడ్‌’తో ఆర్థికరంగం కకావికలం

ఈ వైరస్‌ వల్ల చైనా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధి 2020లో 5.4 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇది ఆరు శాతంగా నమోదయింది. చైనాలో సగానికి పైగా పట్టణ ప్రాంత ఉద్యోగాలు కల్పిస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తి పడిపోవడంతో సిబ్బందిని తొలగించక తప్పని పరిస్థితి తలెత్తింది.

With Covid, the economy is winding down

ఎవరినీ ఇళ్లకు పంపించొద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు వ్యర్థమైపోగల సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా తోక ముడవకపోతే పరిస్థితి మెరుగుపడకపోతే మూడింట ఒక వంతు ఫ్యాక్టరీలు నెల రోజుల్లో చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితిని ఎదుర్కొంటాయని, వెయ్యి చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పరిస్థితిని పరిశీలించిన ఒక సర్వే హెచ్చరించింది. అక్కడి ప్రైవేట్‌ ఫ్యాక్టరీల్లో 40శాతం మేరకు త్వరలోనే నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని మరో సర్వే ప్రకటించింది.

క రోనా ప్రభావం యావత్‌ ప్రపంచంలోని అన్ని రంగాలపై పడుతోంది. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అతలాకుత లమవ్ఞతోంది. ఆర్థికరంగం, టూరి జంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రపంచ పర్యాటక రంగంపై కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ పంజా విసురు తోంది. ఇప్పుడిప్పుడే భారత్‌లో ప్రవేశించిన కరోనాతో అన్ని దేశాలు ‘ట్రావెల్‌ బ్యాన్‌ దిశగా సాగుతున్నాయి. సాలీనా రూ. 411.40 లక్షల కోట్ల ఆదాయం ఉన్న పర్యాటకరంగంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలతో సమీప భవిష్యత్తులో పర్యాటకం పరిస్థితి దారుణంగా దిగజారే ప్రమాదముందని మూడీ లాంటి మార్కెట్‌ విశ్లేషణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

31.9 కోట్ల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. చైనాలో మొదలైన కరోనా అంటువ్యాధి ఇప్పుడు దాదాపు 66 దేశాలకు పాకి ప్రపంచ ప్రళయమైంది. మృతుల సంఖ్యను రోజురోజుకు పెంచుతున్నది. వ్యాధిని అంతమొందించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు స్వల్పంగా ఫలించి అక్కడ దాన్ని ఉధృతి తగ్గుతున్న సూచనలు కన్పిస్తున్నప్పటికీ ఇతర దేశాలకు అది తన మారణ కాండను విస్తరింపచేస్తున్నది. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది. చైనాలో మృతుల సంఖ్య మూడువేలకు చేరుకున్నది. ఒకవైపు ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ కరకరా నమిలి మింగేస్తున్నది. చైనాలో మెజారిటీ కార్మికులు కరోనా భయంతో ఇళ్లకే పరిమితైపోవడంతో అక్కడి పలు పరిశ్రమల్లో, బహుళ జాతి సంస్థల్లో ఉత్పత్తి భారీగా దెబ్బతింటున్నది. దాని ప్రభావం దేశదేశాల ఆర్థిక వ్యవస్థల మీద పడుతున్నది.

కరోనా ఆసియా ఖండం బయటకి వ్యాపిస్తే ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వృద్ధి 1.3 శాతం మేరకు దెబ్బతిం టుందని దాని కిమ్మత్తు 1.1 ట్రిలియన్‌ డాలర్లుండగలదని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా వల్ల చైనీయుల రాబడి పడిపోయింది. ఆ మేరకు వారి ఖర్చు తగ్గిపోయింది. అందువల్ల త్రైమాసిక ఆదాయ లక్ష్యం సాధించడం కష్టతరం కాగలదని యాపిల్‌ కంపెనీ తన మదుపు దార్లకు తెలియచేసింది. ఊహించిన విధంగా ఇరాన్‌లో ప్రాణాలు టపటపారాలిపోతున్నాయి.

ఇప్పటికే ఇరాన్‌లో 40 మందికిపైగా మరణించినట్టు సమాచారం. దక్షిణ కొరియా, జపాన్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, ఇటలీ, మకావూ తదితర అనేక దేశాలు వణుకుతున్నాయి. అమెరికాలోనూ కేసులు బయటపడ్డాయి. వూహాన్‌ నుంచి వచ్చిన 47 మందిలో వైరస్‌ను కనుగొన్నారు. ఏ దేశానికి వెళ్లని స్థానికుల్లోనూ వైరస్‌ కనిపించడంతో అమెరికా బెంబేలెత్తుతున్నది. అది తన ఐఫోన్ల సరఫరాను తగ్గించివేసింది. కరోనా కారణంగా చైనా నుంచి విడిభాగాల దిగుమతి ఆగిపోతే బ్రిటన్‌లోని తన ఫ్యాక్టరీల్లో వాటికి కొరత ఏర్పడుతుందని అది ఉత్పత్తి మీద తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ కార్ల ఫ్యాక్టరీ ప్రకటించింది.

ఈ వైరస్‌ వల్ల చైనా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధి 2020లో 5.4 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇది ఆరు శాతంగా నమోదయింది. చైనాలో సగానికి పైగా పట్టణ ప్రాంత ఉద్యోగాలు కల్పిస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తి పడిపోవడంతో సిబ్బందిని తొలగించక తప్పని పరిస్థితి తలెత్తింది. ఎవరినీ ఇళ్లకు పంపించొద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు వ్యర్థమైపోగల సూచనలు కనిపిస్తున్నాయి.

కరోనా తోక ముడవకపోతే పరిస్థితి మెరుగుపడకపోతే మూడింట ఒక వంతు ఫ్యాక్టరీలు నెల రోజుల్లో చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితిని ఎదుర్కొంటాయని, వెయ్యి చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పరిస్థితిని పరిశీలించిన ఒక సర్వే హెచ్చరించింది. అక్కడి ప్రైవేట్‌ ఫ్యాక్టరీల్లో 40శాతం మేరకు త్వరలోనే నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని మరో సర్వే ప్రకటించింది.

తొందరలోనే పరిస్థితి మెరుగుపడితే ఆర్థిక వ్యవస్థకు ఊహిస్తున్న ముప్పు పరిమితం కావచ్చు.ఇది కరోనా ఇక సోకదు అనే భరోసా కలిగించే వైద్యశాస్త్ర విజయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే దీన్ని వాడితే ఖచ్చితంగా కరోనా చచ్చి ఊరుకుంటుందని భరోసా కలిగించే మందును కనుగొన్న జాడలు లేవ్ఞ. కరోనా వ్యాధి నీళ్లలో మొసలి మాదిరిగా చలి వాతావరణంలోనే విజృంభిస్తుందని శాస్త్రజ్ఞులు నిగ్గు తేల్చారు.

వేసవి పెరుగుతున్నందున మనదేశంలో అది వ్యాపించడానికి అవకాశాలు తక్కువ. కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్‌ పరిశ్రమను గట్టి దెబ్బతీసింది. చైనాలోనే కాకుండా జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీలలోనూ, అమెరికాలో నూ ఈ వ్యాధి ఈ పరిశ్రమకు మృత్యుఘాతంగా నిరూపించుకుం టున్నది. అధిక సంఖ్యలో జనం గుమిగూడే స్థలాల్లో, జాతరులు, మహాప్రదర్శనలు,భారీ ఊరేగింపులు వంటివి జరిగే చోట్ల వైరస్‌లు అధికంగా, వేగంగా సోకుతాయి.

అందుచేత ఎవరికి వారు అటువంటి చోట్లకు దూరంగా ఉండటం వల్ల తమను తాము కాపాడుకోగలుగుతారు. కరోనా మరి కొన్నాళ్ల పాటు కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌-19 అనే శాస్త్రీయ నామాన్ని ధరించిన కరోను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఇతర ప్రాంతాలకు అతి వేగంగా విస్తరించే వ్యాధిగా పరిగణించే విషయం ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇటువంటి విశ్వవిపత్తును ఎదుర్కోవడానికి,అంతమొందించడానికి ప్రపంచ దేశాలన్నీ మరింత సంఘటితంగా కృషి చేయవలసిన అవసరం ఉంది.

అతలాకుతలమవుతున్న దేశాలు

చైనాకు రాకపోకలను నిషేధించాయి. డ్రాగన్‌ దేశం తర్వాత అత్యధిక కరోనా బాధితులున్న దక్షిణ కొరియాకు 70 దేశాలు విమాన సర్వీసులు నిలిపివేశాయి. కొవిడ్‌-19తో అతలాకుతలం అవ్ఞతున్న ఇరాన్‌నుంచి రాకపోకలపై అమెరికా 14రోజుల నిషేధం విధించింది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రధానంగా 18 కోట్ల పాస్‌పోర్టు లున్న పౌరులతో అంతర్జాతీయ పర్యాటకరంగానికి చైనా ప్రధాన ఆదాయ వనరు అని ఆయా సంస్థలు చెబుతున్నాయి. చైనా తర్వాత ఆ స్థాయిలో పాస్‌పోర్టులున్న పౌరులు (14.7 కోట్లు) అమెరికాలో ఉన్నారు.

ఒక్క అమెరికాలోనే ముందస్తుగా వేసవి పర్యాటకానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న వారు ఇప్పుడు దేశం వదిలి వెళ్లడానికి జంకుతున్నారు. తమ షెడ్యూల్స్‌ని మార్చుకున్నా రని ‘కైసర్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

ఈ నెలలో పలు దేశాల్లో 400కుపైగా ప్రపంచస్థాయి కాన్ఫరెన్సులు జరగాల్సి ఉండగా, కరోనా భయంతో సగానికి పైగా రద్దయ్యాయి. బార్సిలోనాలో ‘ప్రపంచ మొబైల్‌ కాంగ్రెస్‌ జెనీవాలో ‘మోటార్‌ షో ‘ఎఫ్‌-8 కాన్ఫరెన్స్‌ బెర్లిన్‌లో జరగాల్సిన ‘అంతర్జాతీయ పర్యాటక షో రద్దుకావడంతో లక్షల సంఖ్యలో అంతర్జాతీయ ‘బిజినెస్‌ ప్రయా ణాలు నిలిచిపోయాయి. బిజినెస్‌ ట్రిప్పులను లక్ష మంది రద్దు చేసుకున్నారు.

-ప్రభు పులవర్తి, ఫ్రీలాన్స్‌జర్నలిస్టు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/