బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం..

ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

అమరావతి : ఏపీ కి భారత వాతావరణ కేంద్రం తుపాను హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, అది తీవ్ర వాయుగుండంగా మారుతోందని పేర్కొంది. దాని ప్రభావంతో ఏపీలోని ఉత్తర తీర ప్రాంతంతో పాటు ఒడిశా దక్షిణ ప్రాంతాలపై తుపాను ఏర్పడుతుందని పేర్కొంది. సైక్లోన్ గులాబ్ గా దానికి నామకరణం చేసింది. తుపానుతో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం నాటికి తీవ్రవాయుగుండం వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొంది.

ఏపీ, ఒడిశాతో పాటు తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆ గాలుల వేగం రేపటికి 75 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/