అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..’తానా’ డైరెక్టర్ భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి

తానా బోర్డు డైరెక్టర్ కుటుంబంలో విషాదం

‘Tana’ director’s wife and two daughters killed in fatal road accident in America

తానా బోర్డు డైరెక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య, ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కూతురిని తీసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తానా బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. డాక్టర్ శ్రీనివాస్ హ్యూస్టన్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య వాణి ఐటీ ఉద్యోగి. ఇద్దరు కుమార్తెలలో పెద్ద కూతురు వైద్య విద్యను అభ్యసిస్తోంది. చిన్న కూతురు 11వ తరగతి చదువుతోంది. దసరాకి పెద్ద కూతురుని ఇంటికి తీసుకురావడానికి వాణి, ఆమె చిన్న కూతురు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న లెక్సస్ కారును చెవీ పికప్ ట్రక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తనకుటుంబాన్ని కోల్పోయారు. ఈ ఘటనపై తానా సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ కృష్ణా జిల్లా కురుమద్దాలిలో పుట్టి గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. తర్వాత 1995లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలోని హ్యూస్టన్ కుటుంబంతో పీడియాట్రిక్ కార్డియోవాస్కులర్ అనస్థీషియాలజిస్ట్‌గా స్థిరపడ్డారు. 2017 నుండి, తానా బోర్డు మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/