భారత్‌లో ఒకేరోజులో 6088 పాజిటివ్‌ కేసులు

మొత్తం మృతుల సంఖ్య 3,583 ..మొత్తం కేసులు 1,18,447

coronavirus-India
coronavirus-India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజిృంభిస్తుంది. గత 24 గంటల్లో అత్యధికంగా 6088 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే ఒకేరోజు పాజిటివ్‌ కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,583కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,18,447కి చేరింది. 66,330 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 48,533 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను విడుదల చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/