బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి..?

బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వెళ్తున్నారా..? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తుంది. మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అన్ని పార్టీ లు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఒక పార్టీలోని నేతలు మరో పార్టీ లోకి..మరో పార్టీ నేతలు..ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు చూస్తున్నారు. ముఖ్యంగా పలువురు బిఆర్ఎస్ నేతలు , బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతుండగా..తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి లు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నట్లు ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ని కలవరపెడుతుంది.

టీ పీసీసీ చీఫ్ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత చాలా మంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి నేరుగానే హైకమాండ్ పై కూడా విమర్శలు చేశారు. తర్వాత అందరూ సర్దుకున్నారు. ఇటీవల ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరింత ప్రో యాక్టివ్ అయ్యారు. రేవంత్ తో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైకమాండ్ ను కలిసి తాము విబేధాలన్నీ మర్చిపోయి పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తున్నామని చెబుతున్నారు. దీంతో అంతా సర్దుకుపోయిందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సైలెంట్ గా ఉన్న నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి , జానారెడ్డిపై బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సమీప బంధువు పాడి కౌశిక్ రెడ్డి. తన రాజకీయ వారసుడు కౌశిక్ రెడ్డేనని ఉత్తమ్ చెబుతూంటారు . అలాంటి కౌశిక్ రెడ్డి తాను పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడే బీఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీ పొందారు . వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ టిక్కెట్ కూడా ఖరారు చేసుకున్నారు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి ఉత్తమ్ కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. జానారెడ్డి తన రాజకీయ వారసుడి కోసం.. బీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్నరాని చెబుతున్నారు. మరి నిజంగా వీరు బిఆర్ఎస్ లో చేరతారా లేదా..అనేది చూడాలి.