రిలయన్స్ జియోలో మరో కంపెనీ భారీ పెట్టుబడి
రూ.11,367 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన కేకేఆర్

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోప్టాట్ఫామ్స్లో అమెరికాకు చెందిన ప్రముఖ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ రూ. 11,367 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. కాగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో కేకేఆర్ రూ.11,367 కోట్లు పెట్టుబడి పెట్టనుందని ఆర్ఐఎల్, జియో ప్లాట్‌ఫామ్స్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఈ లావాదేవీ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లు కాగా, ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లని ఆర్ఐఎల్ తెలిపింది. ఈ పెట్టుబడితో జియోలోని 2.32 శాతం వాటా కేకేఆర్ పరం కానుంది. కాగా, టెక్నాలజీ దిగ్గజాలైన ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్‌ల పెట్టుబడి ద్వారా జియో రూ. 78,562 కోట్లు సమీకరించింది. కాగా ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన పెట్టుబడి సంస్థ కేకేఆర్‌ను స్వాగతించడం సంతోషంగా ఉంది. భారతీయులందరి ప్రయోజనాల కోసం భారతీయ డిజిటల్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి, మార్చడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో విలువైన భాగస్వామి” అని రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ అన్నారు. మొత్తం ఐదు వారాల్లో ఐదు డీల్స్ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.78,562 కోట్ల పెట్టుబడులు రానుండటం విశేషం.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/