హైవేపై టమాటాలు ట్రక్కును ఎత్తుకెళ్లిన జంట

టమాటా కు ఉన్న డిమాండ్ వల్ల సామాన్య ప్రజలు సైతం దొంగలుగా మారుతున్నారు. ఇళ్లలో, మార్కెట్లో పడి టమాటాలు దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా ఓ జంట బెంగళూరు హైవే ఫై ఓ రైతు వద్ద ఆక్సిడెంట్ పేరుతో డ్రామా ఆడి, ట్రక్కును ఎత్తుకెళ్లిన ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

నెలక్రితం వరకు కూడా కేజీ టమాటా రూ. 10 , 20 ఉండేది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా కేజీ రూ. 100 అయ్యింది. ప్రస్తుతం రూ. 120 నుండి 150 వరకు మార్కెట్ లలో పలుకుతుంది. దీంతో టమాటా పండించిన రైతులు కోటేశ్వర్లు అవుతున్నారు. దీంతో చాలామంది టమాటా పండించిన రైతులను టార్గెట్ చేస్తున్నారు. కొంతమంది రైతుల ఇళ్లలో దొంగతనాలు చేసి డబ్బు ఎత్తుకెళ్తున్నారు. మరికొంతమంది టమాటా లు చోరీ చేస్తున్నారు.

ఈ క్రమంలో తమిళనాడుకి చెందిన ఓ జంట టమాటాల కోసం పెద్ద నాటకమే ఆడింది. 2.5 టన్నులున్న ఓ ట్రక్‌ని హైజాక్ చేసింది. బెంగళూరు నుంచి ట్రక్‌ని చోరీ చేసి తీసుకెళ్లిపోయింది. యాక్సిడెంట్ డ్రామా ఆడి సింపుల్‌గా ట్రక్‌ని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన ఫై సదరు రైతు వెల్లూరు పోలీసులకు పిర్యాదు చేయడం తో ఈ విషయం బయటకు వచ్చింది. తమిళనాడుకి చెందిన ఓ జంట తమ కార్‌తో ఓ ట్రక్‌ని కావాలనే ఢీకొట్టింది. ఆ తరవాత ఆ ట్రక్ డ్రైవర్‌తో గొడవపడింది. రిపేర్‌ చేయించుకోడానికి డబ్బులివ్వాలని డిమాండ్ చేసింది. ఆ ట్రక్ డ్రైవర్ ఓ రైతు. డబ్బులివ్వను అని తేల్చి చెప్పాడు. మాట్లాడుతుండగానే ఈ జంట రైతుపై దాడి చేసింది. ట్రక్‌ నుంచి రైతుని బయటకు లాగేసింది. 2.5 టన్నులున్న ఆ ట్రక్‌ని ఎత్తుకెళ్లింది. వాటి విలువ రూ.2.5 లక్షలు. జులై 8న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే ఆ ట్రక్‌ని గుర్తించారు. నిందితులు భాస్కర్, సింధూజను అరెస్ట్ చేశారు. వీళ్ల గ్యాంగ్‌లో మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు.