దేశంలో 718కి చేరిన కరోనా మరణాలు!

గత 24 గంటల్లో 27 మంది మృతి..23 వేలు దాటిన మొత్తం కేసులు

corona virus- india
corona virus- india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,684 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 27 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 23 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 23,077కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 718కి పెరిగింది. యాక్టివ్ కేసులు 17,610కి పెరిగాయి. 4,749 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ బారి నుండి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం ఊరటనిస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/