కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎవరు లేరు..అదంతా వారి అపోహ – జానారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసే బదులు వారికీ వారే గొడవలు పెట్టుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సీనియర్ – జూనియర్ అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేతలంతా సమావేశం ఫై రేవంత్ ఫై ఫైర్ అయ్యారు. టీడీపీ నుండి వచ్చిన వారికే పదవులు దక్కాయని , కాంగ్రెస్ పార్టీ లో కొన్నేళ్లుగా ఉన్నమాకు ఎలాంటి పదవులు దక్కలేదని ఫైర్ అయ్యారు. దీంతో పదవులు దక్కిన నేతలు రాజీనామా చేసారు. ఇలా రోజు రోజుకు గొడవలు తారాస్థాయికి చేరుతుండడం తో వీటిని సరిదిద్దెందుకు దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. ఈరోజు నేతలతో సమావేశమయ్యారు.

ఈ క్రమంలో సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు లేరని, కోవర్టు అనేది అపోహ మాత్రమేనని అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. దిగ్విజయ్ సింగ్తో జానారెడ్డి భేటీ అయ్యారు. దిగ్విజయ్ సింగ్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారని.. అన్ని వివరాలు ఆయన చెప్తారని తెలిపారు. పార్టీలో ఎటువంటి గందరగోళం లేదని.. రెండు మూడురోజుల్లో అందరూ కలిసిపోతారని స్పష్టం చేశారు.