భారత్‌లో 24 గంటల్లో 507 మంది మృత్యువాత

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,85,493

Coronavirus in India
Coronavirus in India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో 507 మంది మరణించగా, కొత్తగా 18,653 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్క రోజులో ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,85,493కి చేరగా, మరణించినవారి సంఖ్య 17,400కు పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 2,20,114 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,47,979 మంది బాధితులు కోలుకున్నారు. జూన్‌ 30 వరకు 86,26,585 పరీక్షలు చేశామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 2,17,931 నమూనాలు పరీక్షించామని తెలిపింది. దేశంలో నిన్న 18522 మంది కరోనా బారినపడ్డారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/