108,104 వాహనాలను ప్రారంభించిన సిఎం

YouTube video
Inauguration of 108 and 104 Vehicles by Hon’ble CM of AP at Benz Circle, Vijayawada

విజయవాడ: సిఎం జగన్‌ 108, 104 వాహనాలను ప్రారంభించారు. బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం జగన్‌ జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. రూ.201 కోట్లతో 1068 కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాగా సిఎం వాహనాలను ప్రారంభించాక..కొత్త వాహనాలు జగన్ ముందు ప్రదర్శనగా వెళ్లాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వేలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/