గిల్డ్ ఫై మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఆగ్రహం

మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ..(ప్రొడ్యూసర్స్ గిల్డ్) ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా ఈయన బ్యానర్ వైజయంతి మూవీస్‌ పై తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం అశ్వినీదత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

థియేటర్ కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిందని..టిక్కెట్ల రేట్లు పెరిగిపోవడం..థియేటర్స్ లలో తినుబండారాల ధరలు పెంచడంతో ఫ్యామిలీతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకులకు పూర్తిగా థియేటర్ ను మరచిపోయారు. నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ధరలు తగ్గించాలని ఓసారి.. పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్‌ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్‌ బంద్‌’ అని ఆందోళన చేస్తున్నారు. కరోనాతో పాటు టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం, సినిమాలకు వ్యయం ఎక్కువయ్యిందని సీఎంలతో ధరలను పెంచుకున్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్‌ ప్రజలు థియేటర్‌కు రావడం లేదు. సినిమాహాల్‌ క్యాంటీన్‌లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈ లోపు ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలపై దండయాత్ర చేస్తున్నారు. కానీ, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం.

నిర్మాత అశ్వనీదత్ వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. 50 సంవత్సరాలుగా నిర్మాణ రంగంలో ఉన్న అశ్వనీదత్ గారి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. ఏ హీరోని, ఏ దర్శకుడిని రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అడిగే అర్హత ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఒక్కో మోడల్ కారుకు ఒక్కో రేటు ఉంటుందని, అలాగే అందరూ హీరోలే అయినా, ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుందని వివరించారు.

ఇవాళ కాల్షీట్లకు, షీట్లకు తేడా తెలియనివాళ్లు, షూటింగ్ ఎన్నింటికి మొదలవుతుందో, ఎన్నింటికి ప్యాకప్ అవుతుందో తెలియనివాళ్లు, ఏ రోజు ఏ లైట్లు వాడుతున్నారో తెలియనివాళ్లు, ఏ లొకేషన్ కు ఎంత చార్జి అవుతుందో తెలియనవాళ్లు కూడా సినిమాలు తీస్తున్నారని బండ్ల గణేశ్ ఎద్దేవా చేశారు.