ఏపిలో మరో 80 మందికి కరోనా పాజిటివ్‌

ఏపిలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,177

Corona Cases in Andhra Pradesh
Corona Cases in Andhra Pradesh

అమరావతి: ఏపి కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. గడిచిన 24గంటలో ఏపిలో కొత్తగా మరో 80 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కి చేరింది. ఈమేరకు ఏపి వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కాగా ఏపిలో దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,177కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 292, ఆ తర్వాత గుంటూరులో 237 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 911గా ఉంది. 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

జిల్లాలో కొత్త కరోనా కేసులు

కర్నూలులో కొత్తగా 13, గుంటూరులో 23, కృష్ణా జిల్లాలో 33, పశ్చిమ గోదావరిలో 3, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 7 కేసులు నమోదయ్యాయి.

ఏపిలో మరో 80 మందికి కరోనా పాజిటివ్‌

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/