నేడు సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ పర్యటన

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసి, నేడు వర్చువల్ గా ప్రారంభింస్తున్నందుకు సిఎం కెసిఆర్‌కు పెద్ద ఎత్తున కృతజ్ఞత సభ నిర్వహణకు బిఆర్ఎస్ పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఈ సందర్భంగా కెటిఆర్ సిరిసిల్లాకు రానున్నారు. మెడికల్ కాలేజీ ఓపెనింగ్ లో పాల్గొని అనంతరం బహిరంగ సభలో కెటిఆ పాల్గొనున్నారు .
ఇక సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సభ వేదిక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. అంబేద్కర్ చౌరస్తాలో సభ వేదిక ఏర్పాటు చేయడంపై విమర్శలు…వెల్లువెత్తుతున్నాయి. కృతజ్ఞత సభ జరిగే సమయంలోనే టెట్ ఎగ్జామ్ వుండటంతో, పరీక్షకు హాజరయ్యేందుకు సిరిసిల్ల పట్టణానికి 3378 టెట్ అభ్యర్థులు రానున్నారు. సభ వేదికకు కూతవేటు దూరంలోనే రెండు టెట్ ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ సభకు వచ్చే వాహనాల పార్కింగ్ సైతం పరీక్ష కేంద్రం పక్కనే ఏర్పాటు చేశారు. పరీక్ష వ్రాయడానికి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సభ ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృతజ్ఞత సభ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో ఇవాళ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో టెట్ అభ్యర్థులతో పాటు సాధారణ ప్రజానీకం ఇబ్బందులు పడనున్నారని విమర్శలు వస్తున్నాయి.