ఏపీలో కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్

municipal-elections-polling-going-on-in-ap

రాష్ట్రంలో పలు కారణాల చేత ఆగిపోయిన పలు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సోమవారం కార్పొరేషన్, మునిసిపల్, పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా.. మంగళవారం మిగిలిపోయిన పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ స్థానాల పరిధిలో.. 8,07,640 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం పది జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 954 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 7 వేల మంది సిబ్బందిని ఎన్నికల కమిషన్ వినియోగిస్తోంది. అవసరమైన చోట బుధవారం రీ-పోలింగ్‌ నిర్వహిస్తారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.

సోమవారం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. దొంగ ఓట్ల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు అధికార పార్టీ స్థానికేతరులను తరలించి, వారితో ఓట్లు వేయించేందుకు ప్రయత్నించిందని తెదేపా శ్రేణులు పలుచోట్ల ఆందోళనలకు దిగాయి. ఈ తరుణంలో పరిషత్ ఎన్నికలకు సంబంధించి గట్టి బందోబస్తు ఏర్పటు చేసారు. ఉదయం నుండి కూడా చాల చోట్ల పోలింగ్ మందకొడిగా నడుస్తుంది. సాయంత్రం వరకు ఓటు వేసే అవకాశం ఉండడం తో ఓటర్లు తమ పనులలో బిజీ అయ్యారు. మరోవైపు ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న పార్టీలు.. పోలింగ్ కేంద్రాలకు కాస్త దూరంలో ప్రచారం చేయడం కనిపించింది. మధ్యాహ్నం వరకు పోలింగ్ వేగం పుంజుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.