రామ్ చరణ్ – శంకర్ మూవీ టైటిల్ ‘అధికారి’ ..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ శంకర్ కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్ , అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు అధికారి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్ పవర్​ఫుల్​గా ఉండటంతో ప్రచారంలో ఉన్న ‘అధికారి’ పేరే ఖాయమైనట్టు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ తాలూకా షూటింగ్ పిక్స్ సోషల్ మీడియా లో లీక్ అవుతూ వస్తున్నాయి. కొన్ని పిక్స్ లో చరణ్ పంచె కట్టులో సైకిల్ తొక్కుతూ వెళ్తున్నట్లు కనిపించాడు. ఈ పిక్ చూసిన చాలామంది ఈ సన్నివేశం సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది కావొచ్చని అంటున్నారు. ‘భారతీయుడు, జెంటిల్ మెన్, అపరిచితుడు’ వంటి చిత్రాల మాదిరిగా ఈ సినిమాలోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవబోతుందని అంటున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ ఓ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.