నేటి నుండి పవన్ వారాహి యాత్ర ప్రారంభం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర ను నేటి నుండి ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తొలుత తొమ్మిది నియోజకవర్గాల్లో షెడ్యూలు ఖరారైంది. అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శించుకుని ఆ తర్వాత ఆయన పర్యటన ప్రారంభించనున్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి సెంటర్‌లో తొలి సభ ఏర్పాటు చేశారు. వారాహి వాహనంపై నుంచి ఆయన అక్కడ ప్రసంగించనున్నారు. అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. తొలి పది రోజుల్లో ఏడు బహిరంగసభల్లో పవన్‌కల్యాణ్‌ ప్రసంగిస్తారు.

పవన్ కళ్యాణ్ యాత్ర విజయవంతానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు, నాయకులతో చర్చలు జరిపి ఏడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. వారాహి యాత్రకు హజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి సభ వద్ద మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నారు.

వారాహి యాత్ర షెడ్యుల్ చూస్తే..

14-06-2023 : ప్రత్తిపాడు నియోజకవర్గంలో కత్తిపూడి లో సభ
16–06-2023 : పిఠాపురంలో వారాహి యాత్ర, సభ
18– 06-2023 : కాకినాడులో వారాహి యాత్ర, సభ
20-06–2023 : ముమ్మడివరంలో వారాహి యాత్ర, సభ
21-06-2023 : అమలాపురంలో వారాహి యాత్ర, సభ
22-06-2023 : పిన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర, రాజోలు నియోజకవర్గం మలికిపురం లో సభ
23–06-2023 : నరసాపురంలో వారాహి యాత్ర, సభ.