మసీదుల్లో విదేశియులు

సహకరించిన అలహబాద్‌ యూనివర్శిటి ప్రోఫెసర్‌

tabligi jammat musalmans
tabligi jammat musalmans

ప్రయాగరాజ్‌: దేశంలో ఒక్క సారిగా కరోనా కేసులు పెరగడానికి కారణమైన ఢిల్లీ మత ప్రార్ధ్దనలకు వచ్చిన విదేశియులను మసీదుల్లో దాచి పెట్టారన్న వార్త ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టగా ఇండోనేషయాకు చెందిన 7 మంది, థాయిలాండ్ కు చెందిన 9 మందిని అరెస్టుచేశారు. వీరికి సహకరించిన 12 మంది వ్యక్తులు, వారిని దాచి ఉంచిన అలహాబాద్‌ యూనివర్శిటి ప్రొపెసర్‌ మహ్మాద్‌ షాహిద్‌ ను కూడా అరెస్ట్‌ చేశారు. జామాతే సభ్యులను దాచి ఉంచడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. కాగా మార్చి నెలలో డిల్లీలోని నిజాముద్దిన్‌లో జామాతే మర్కజ్‌ సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఓ పక్క కరోనా కట్టడికి దేశమంతా లాక్‌డౌన్‌లోఉంటే జమాతే సభ్యులను, అందులోను విదేశియులను దాచి ఉంచడంతో ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని యోగి సర్కారు అనుమానిస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/