పుదుచ్చేరి సిఏం రంగస్వామికి కరోనా
చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స

- పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ
- ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల వెల్లడి
- మే 7న సీఎంగా ప్రమాణం చేసిన సంగతి విదితమే
పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. . ప్రస్తుతం రంగస్వామి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మే 7వ తేదీన ముఖ్యమంత్రిగా రంగస్వామి బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/