నరసరావు పేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి
బైక్ ను ఢీకొట్టిన కారు

- ఫిరంగిపురం సమీపంలో వేములూరి పాడు వద్ద ప్రమాదం
- మృతులందరూ తాళ్లూరు గ్రామస్తులు
- గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృత దేహాల తరలింపు
- కారు డ్రైవర్ పరారీ: పోలీసులు దర్యాప్తు
Narasarao Pet: నరసరావు పేట సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఫిరంగిపురం సమీపంలో వేములూరి పాడు వద్ద తాళ్లూరు నుంచి అమరావతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఫిరంగిపురం మండలం తాళ్లూరుకు చెందిన షేక్ చినహుస్సేన్(55), నూర్జహాన్(45), హుస్సేన్(25)గా గుర్తించారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/