కరోనా మళ్లీ ఎప్పుడైనా విజృంభిచొచ్చు

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోందనీ.. అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ‘‘కరోనా మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో చెప్పలేం…’’ అని ఆయన ప్రజలను హెచ్చరించారు. ‘‘పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. అయినంత మాత్రాన ఏమరుపాటుగా ఉండేందుకు వీల్లేదు. కొవిడ్-19 మళ్లీ ఎప్పుడు విజృంభిస్తుందో ఎవరికీ తెలియదు..’’ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తున్న కారణంగానే ఈ మహమ్మారి అదుపులోకి వస్తోందని సీఎం పేర్కొన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/business/