సుప్రీంకోర్టుకు బాబా రాందేవ్‌ క్ష‌మాప‌ణ‌లు

Baba Ramdev apologizes to the Supreme Court

న్యూఢిల్లీ: ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల గురించి త‌ప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్ ఇవాళ సుప్రీంకోర్టు ముందు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ కేసులో ప్ర‌త్య‌క్షంగా ఇవాళ ఆయ‌న కోర్టుకు హాజ‌ర‌య్యారు. రాందేవ్‌, బాల‌కృష్ణ‌లు వ్య‌క్తిగ‌తం హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించింద‌ని, ఆ ఆదేశాల ప్ర‌కారం ఆ ఇద్ద‌రూ కోర్టుకు వ‌చ్చిన‌ట్లు వాళ్ల త‌ర‌పు న్యాయ‌వాది వెల్ల‌డించారు. ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ దాఖ‌లు చేసిన కేసులో రాందేవ్ బాబా క్షమాప‌ణ‌లు తెలిపారు. ప‌తంజ‌లి సంస్థ‌ ఉత్ప‌త్తుల‌కు గురించి మెడిక‌ల్ యాడ్స్ ఇవ్వ‌డాన్ని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. ఈ కేసులో గ‌తంలో ప‌తంజ‌లి ఎండీ ఆచార్య బాల‌కృష్ణ ప్ర‌త్య‌క్షంగా కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. జ‌స్టిస్ హిమా కోహ్లీ, అషానుద్దిన్ అమానుల్లాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. వారం రోజుల్లోగా మెడిక‌ల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని బాబా రాందేవ్‌, బాల‌కృష్ణ‌కు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది.