ప్రపంచంలో 4.5 లక్షలకు చేరువలో కరోనా మృతులు

ఇప్పటివరకు 82,56,615 కరోనా పాజిటివ్‌ కేసులు

ప్రపంచంలో 4.5 లక్షలకు చేరువలో కరోనా మృతులు
world wide -corona

న్యూయార్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 82,56,615 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడిన 4,45,957 మంది బాధితులు మరణించారు. మొత్తం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 35,04,254 యాక్టివ్‌ కేసులు ఉండగా, 43,06,404 మంది కోలుకున్నారు. కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 22,08,400 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1,19,132 మంది మరణించారు. మరో 11,86,227 పాజిటివ్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడిన 9,03,041 మంది కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/