మీడియా మిత్రులకు కరోనా పాజిటివ్‌

అందరు జాగ్రత్తలు తీసుకోవాలి: కవిత

kalvakuntla kavita
kalvakuntla kavita

హైదరాబాద్‌: దేశంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుంది. ఈ క్రమంలో ప్రజలకు ఎప్పటికపుడు సమాచారాన్ని అందించేందుకు పాటుపడుతున్న మీడియా మిత్రులకు కూడా కరోనా సోకడం ప్రారంభించింది. ఈ నెల 16,17 తేదిల్లో ముంబయిలోని ఆజాద్‌ మైదానంలో ప్రత్యేక కరోనా శిబిరాన్ని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పోరేషన్‌ నిర్వహించింది. ఈ శిబిరానికి 171 మంది మీడియా మిత్రులు రాగా అందులో 53 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అందరిని క్వారంటైన్‌కు తరలించారు. ఈ విషయంపై టిఆర్‌ఎస్‌ మాజి ఎంపి కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ముంబయి జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ అనే వార్త కలచివేసింది. ఇది చాలా దురదృష్టకరం, కరోనా మహామ్మారిపై అందరం యుద్దం చేస్తున్న ఈ తరుణంలో మీడియా మిత్రులు అందరు వారి గురించి, వారి కుటుంబాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని కవిత సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/