ప్ర‌జ‌ల‌ సమస్యలు వినిపిస్తాను..రఘునందన్‌ ‌రావు

ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి పోరాడ‌తా…

హైదరాబాద్: తెలంగాణ‌ అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత‌ రఘునందన్‌రావు తొలిసారి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అంత‌కుముందు ఆయ‌న త‌మ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి హైద‌రాబాద్‌లోని అసెంబ్లీ స‌మీపంలో ఉండే గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘునంద‌న్ రావు మీడియాతో మాట్లాడుతూ… కొన్నేళ్లుగా అసెంబ్లీలో ప్రజల గొంతును వినిపించేవారు లేరని చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌ల‌ సమస్యలు వినిపించడానికే దుబ్బాక ప్రజలు తనను అసెంబ్లీకి పంపారని తెలిపారు. తాను మల్లన్న సాగర్‌ నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తానని చెప్పారు. త‌మ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ప్రజల‌ సమస్యల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తాన‌ని తెలిపారు. పీఆర్సీతో పాటు తెలంగాణ‌లోని ఉద్యోగ సమస్యలపై కూడా సర్కారుని ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/