దేశంలో కొత్తగా 43,393 క‌రోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,52,950

మృతుల సంఖ్య మొత్తం 4,05,939

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 43,393 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 44,459 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,52,950కు చేరింది.

మరణాల విషయానికొస్తే, నిన్న‌ 911 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,05,939కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,98,88,284 మంది కోలుకున్నారు. 4,58,727 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 36,89,91,222 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న‌ 40,23,173 డోసులు వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/