పాకిస్థాన్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 58,278

మొత్తం మృతుల సంఖ్య 1,202

pakistan1st-death-with-coronavirus
pakistan-coronavirus

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మంగళవారంతో 58,278 కు చేరుకుంది. కరోనా కారణంగా పాక్‌లో ఇప్పటివరకు 1,202 మంది మృతిచెందినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ పేర్కొంది. సింధ్‌లో 23,507, పంజాబ్‌20,654, కైబర్‌ఫక్తున్వా8,080, బలూచిస్థాన్‌3,468, ఇస్లామాబాద్‌1,728, గిల్గిత్‌బల్టిస్థాన్‌603, పీవోకేలో 211 మంది వైరస్‌ భారిన పడ్డారు. సింధ్‌ ప్రాంతం కరోనా ప్రభావానికి అత్యధికంగా గురైతుంది. గడిచిన 24 గంటల్లో సింధ్‌లో 573 కొత్త కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/