భారత్ వెళ్తున్నా టూరిస్టులకు అమెరికా హెచ్చరిక
us-asks-travellers-to-be-alert-in-india-because-of-crime-and-terrorism
న్యూఢిల్లీ: అమెరికా భారత్‌లో పర్యటించే టూరిస్టుల కోసం అడ్వైజరీ జారీ చేసింది. ఇండియా వెళ్లే టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలని, అక్కడ నేరాలు, ఉగ్రవాదం ఎక్కువగా ఉన్నట్లు తమ అడ్వైజరీలో ఆ దేశం పేర్కొన్నది. ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండానే, టూరిస్టు కేంద్రాల్లో, ట్రాన్స్పోర్ట్ హబ్స్‌లో, షాపింగ్ మాల్స్‌పై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉన్నట్లు తమ దేశ టూరిస్టులను అమెరికా హెచ్చరించింది.
ఇండియాలో రేప్ ఘటనలు ఎక్కువయ్యాయని, పర్యాటక ప్రదేశాల్లో లైంగిక దాడి ఘటనలు పెరుగుతున్నట్లు అమెరికా తన అడ్వైజరీలో సూచించింది. జమ్మూకశ్మీర్, ఈస్ట్రన్ లడాఖ్, నార్త్ ఈస్ట్, సెంట్రల్, ఈస్టిండియాతో పాటు ఇండోపాక్ బోర్డర్‌కు పది కిలోమీటర్ల దూరంలో టూరిస్టులు ఎవ్వరూ వెళ్లకూడదంటూ హెచ్చరికలు చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/