పాకిస్థాన్ ‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిః బైడెన్

వాషింగ్టన్ః ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్ ఒకటి అని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఆ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో బైడెన్ ఈ కామెంట్ చేశారు. ఆ సమావేశంలో చైనా, రష్యా తీరును కూడా ఆయన ఖండించారు. చైనా, రష్యాతో ఉన్న విదేశాంగ విధానంపై మాట్లాడుతున్న సమయంలో పాక్‌పై బైడెన్ ఆ వ్యాఖ్యలు చేశారు.
డెమోక్రటిక్ పార్టీ ఈవెంట్‌లో బైడెన్ చేసిన వ్యాఖ్యలను వైట్‌హౌజ్ ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించారు. బైడెన్ వ్యాఖ్యల వల్ల పాక్ పరిస్థితి దయనీయంగా మారింది. అమెరికాతో సంబంధాలను బలపరుచుకోవాలని షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆ వ్యాఖ్యలు పాక్‌కు శాపంగా మారనున్నాయి. 21వ శతాబ్ధం రెండవ క్వార్టర్‌లో అమెరికాను డైనమిక్‌గా మార్చేందుకు అనేక అవకాశాలు ఉన్నట్లు బైడెన్ తెలిపారు. ఇటీవల నేషనల్ సెక్యూర్టీ స్ట్రాటజీకి చెందిన డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. 48 పేజీలు ఉన్న ఆ డాక్యుమెంట్‌లో పాకిస్థాన్ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. చైనా, రష్యా వల్ల అమెరికాకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/