తెలంగాణ హైకోర్టులో కరోనా కలకలం

రేపటి నుండి హైకోర్టు మూసివేత

Telangana High Court
Telangana High Court

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. తాజాగా హైకోర్టులో 25 మంది ఉద్యోగులకు కరోనా సంక్రమించింది. దీంతో రేపటి నుంచి హైకోర్టు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టును పూర్తిగా శానిటైజ్ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. కరోనా ఇన్ఫెక్షన్ ను దృష్టిలో ఉంచుకుని హైకోర్టులోని ఫైళ్లు మొత్తం జ్యుడిషియల్ అకాడమీకి తరలించారు. ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించాలని నిర్ణయించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/