చెరువులో పడ్డ బస్సు.. 21 మంది మృతి

చైనాలోని గూయిజ్‌హౌ ప్రావిన్సులో ఘటన

చెరువులో పడ్డ బస్సు.. 21 మంది మృతి
bus plunges into lake in southern China

చైనా: చైనా దేశంలోని గూయిజ్‌హౌ ప్రావిన్సులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు బస్సు చెరువులో పడి 21 మంది ప్రయాణికులు మరణించారు. ప్రయాణికులతో ఉన్న బస్సు రోడ్డుపై ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని అన్షున్ నగరంలోని హోంగ్ షాన్ చెరువులోకి దూసుకుపోయింది. చెరువునీటిలో బస్సు మునిగిపోవడంతో అందులోని 21 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయడగా.. కొందరు గల్లంతయ్యారు. ప్రయాణికుల్లో చైనాలోని గావోకా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు రాయవాల్సిన విద్యార్థులు ఉన్నారని సమాచారం. బస్సులో మొత్తం ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేదిపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కొందరు ప్రయాణికులు చెరువలో గల్లంతవడంతో వారి కోసం రెస్య్కూ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/